ప్రపంచంలో అత్యధికులు వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం ఉండితీరాల్సిందే. యూజర్ల సౌలభ్యం కోసం, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గానూ..
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో భాగంగా వాట్సాప్‌ను వాడే ఫోన్ల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా వచ్చే జనవరి నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. వివరాల్లోకి వెళితే..
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో తమ యూజర్లకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు వాట్సాప్ (WhatsApp) కూడా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2025 జనవరి నుంచి కొన్ని ఫోన్లలో తమ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌తో పని చేస్తున్న ఫోన్లలో జనవరి నుంచి వాట్సాప్ పని చేయదని తెలిపింది.
పాత ఫోన్లలో వాట్సాప్‌ను వాడడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఐఓఎస్ 15.1తో పాటూ ఇంకా పాత వెర్షన్లకు సంబంధించిన ఐఫోన్లలో (iPhones) కూడా వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నారు. ఐఫోన్ 5 ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ ఫోన్లు వాడుతున్న వారు ఎవరైనా ఉంటే.. జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని ఫోన్లలో కూడా వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.
ఈ ఫోన్లనూ మార్చుకోండి..
(శాంసంగ్): Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, (మోటరోలా): Moto G (1వ తరం), Razr HD, Moto E 2014, (HTC): One X, One X+, Desire 500, Desire 601, (LG): Optimus G, Nexus 4, G2 Mini, L90, (సోనీ): Xperia Z, Xperia SP, Xperia T, Xperia V
పైన తెలిపిన ఫోన్లలో మీ ఫోన్ కూడా ఉన్నట్లయితే జనవరి నుంచి కొత్త ఫోన్‌కు మారాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఫోన్లలో మీ వాట్సాప్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోనుంది.