PM Kisan:19వ విడత పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..

www.mannamweb.com


PM Kisan 19th Installment Date:కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan).ఈ పథకం ద్వారా ప్రతియేటా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు అందిస్తోంది..చిన్న,సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది.

రైతు లకు ఆర్థికసాయంగా ఏడాదిలో మూడుసార్లు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

అక్టోబర్ 5, 2024న 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ చేసింది.. ఇక19 వ విడత పిఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు సిద్ధమయింది. 19వ విడత నిధుల విడుదలకు సంబంధించిన తేదీ, బెన్ ఫిషియరీ స్టేటస్, దరఖాస్తు ప్రక్రియ, మీ మొబైల్ నంబర్‌ను PM కిసాన్ పోర్టల్‌కి ఎలా లింక్ చేయాలి అనే అంశాలను ఈ ఆర్టికల్ తెలుసుకుందాం..

పీఎం కిసాన్ 19వ విడత తేది ఫిక్స్!

పీఎం కిసాన్ యోజన నిధులు వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల అకౌంట్లో జమ చేయబడతాయని భావిస్తున్నారు. ఖచ్చితమైన తేదీ నిర్ధారించకపోయినప్పటికీ పీఎం కిసాన్ చెల్లింపు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఓ షెడ్యూల్ ప్రకారం జమ చేయబడతాయి.

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌https://pmkisan.gov.in. ను సందర్శించాలి.
హోం పేజీలో Beneficiary Status పై క్లిక్ చేయాలి. మీ వివరాలు నమోదు చేయాలి.
మీ ఆధార్ నంబర్, బ్యాంక్ , ఖాతానంబర్ లేదా మొబైల్ నంబర్ సబ్మిట్ చేయాలి.మీ స్టేటస్ కనిపిస్తుంది.
PM కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

కొత్త రైతులు PM కిసాన్ కోసం ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCలు) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలో ఇక్కడ ఉంది.
అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్‌https://pmkisan.gov.in.లోకి వెళ్లాలి.
New Farmer Registration పై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వివరాలు సబ్మిట్ చేయాలి.
ఫారం సమర్పించి ఓ కాపినీ సేవ్ చేసుకోవాలి.
సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదానికి ముందు స్థానిక అధికారులచే ధృవీకరించబడుతుంది.