కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు

www.mannamweb.com


2024 సంవత్సరం ముగియబోతోంది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త కోరికలు, కొత్త ఖర్చులు ఉంటాయి. అందువల్ల జనవరి 1, 2025 నుండి ఏయే ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం.

ఇది నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది. పలు కార్ల కంపెనీలు తమ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది కాకుండా, జీఎస్టీ పోర్టల్‌లో మూడు ముఖ్యమైన మార్పులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (ఎఫ్‌డి) సంబంధించిన పాలసీలలో కూడా మార్పులు చేసింది.

టెలికాం కంపెనీల కొత్త నిబంధనలు

జనవరి 1, 2025 నుండి టెలికాం కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ రంగంలోని కంపెనీలు ఆప్టికల్ ఫైబర్, కొత్త మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో యూజర్ల అనుభవంతో పాటు సేవలను మెరుగుపరచటానికి సహాయపడతాయి. టవర్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియలో తక్కువ అవాంతరం ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్‌లో మార్పులు

అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్‌షిప్ నియమాలను జనవరి 1, 2025 నుండి మార్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోను ఒక ఖాతా నుండి రెండు టీవీలలో మాత్రమే ప్రసారం చేయవచ్చు. దీని కంటే ఎక్కువ టీవీలో ప్రసారం చేయడానికి, అదనపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. మొదటి ఐదు డివైజ్‌ల వరకు ఎటువంటి పరిమితి లేదు.

జీఎస్టీ పోర్టల్‌లో మార్పులు:

GSTN జనవరి 1, 2025 నుండి GST పోర్టల్‌లో మూడు ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. వీటిలో రెండు మార్పులు ఇ-వే బిల్లు కాలపరిమితి, చెల్లుబాటుకు సంబంధించినవి. ఒక మార్పు జీఎస్టీ పోర్టల్‌కి సురక్షిత యాక్సెస్‌కి సంబంధించినది. ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే కొనుగోలుదారు, విక్రేత, రవాణాదారు నష్టపోవచ్చు.

RBI FD నియమాలలో మార్పులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2025 నుండి NBFCలు, HFCల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FD) సంబంధించిన విధానాలను మార్చింది. వీటిలో ప్రజల నుండి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించిన మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లను బీమా చేయడం వంటివి ఉన్నాయి.

కార్ల ధరలు పెరగనున్నాయి:

కొత్త సంవత్సరం రాగానే కార్ల ధరలు పెరగనున్నాయి. పలు ప్రధాన కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీలు ధరను సుమారు 3% పెంచనున్నాయి.

ఎల్‌పీజీ ధర:

చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి ధరలను సమీక్షిస్తాయి. గత ఐదు నెలల్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803