సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ఎప్పుడు తెరిచిన పుస్తకం లానే ఉంటుంది. వారు ఏ విషయానైనా దాచాలని ప్రయత్నించినా ఫలితం మాత్రం ఉండదు. ఏదో సమయంలో.. ఏదోక సందర్భంలో ఆ విషయం వెలుగులోకి వస్తుంది.
ఇక సినీ ప్రముఖులు మరొకరితో కాస్త ఫ్రెండ్లీగా, లేదా వేరే వారితో సన్నిహితంగా మెలిగిన.. మరుక్షణంలో వారితో రిలేషన్స్ ఉందంటూ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఒంటరిగా ఉన్న హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తాయి. వారు వేరే వ్యక్తితో కనిపిస్తే చాలు సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొస్తాయి. అలా 48 ఏళ్ల స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి రూమర్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ?
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు వస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే స్టార్ గా గుర్తింపు పొందుతారు. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఫీల్డ్ లో అడుగుపెట్టిన అమ్మడు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్నో సూపర్ హిట్ మూవీలలో నటించి మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ అమ్మడు ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మీనా.
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తన నటనతో మెప్పించి వరుస అవకాశాలను అందుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా శాండిల్ వుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో టాప్ హీరోలతో నటించి మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1982 లో వచ్చిన తమిళ సినిమా ‘నెంజంగల్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పలు సినిమాలలో నటించి మెప్పించింది.
చిన్న వయసులోనే అద్భుతమైన నటన కనబరిచి, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక టాలీవుడ్లో అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. మీనా కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలలో నవయుగం , సాంత్వనం, రాజేశ్వరి కళ్యాణం, చంటి, వీర, ముత్తు, వంటి సినిమాలు ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచాయి. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైనా ఈ అమ్మడు. రీఎంట్రీ తర్వాత తమిళంలో ‘దృశ్యం’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ సినిమాలో మీనా తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ‘దృశ్యం 2’ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మీనా జీవితంలో ఓ పెను విషాదం చోటుచేసుకుంది. తన భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా అనారోగ్యం పాలై మరణించారు.దీంతో మీనా జీవితంలో తీరని విషాదం నెలకొంది. తన కూతురుతో మీనా తన జీవితాన్ని సాగిస్తుంది. అప్పుడప్పుడు సినిమాలలో, టీవీ షో లలో కనిపిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇటీవల మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై మీనా నే స్వయంగా క్లారిటీ ఇచ్చినా.. ఈ రూమర్స్ కు మాత్రం పుల్ స్టాప్ పడటం లేదు. పైగా మీనా తనకంటే చిన్నవాడైన హీరోతో పెళ్లికి సిద్ధమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా మీనా ను రెండో పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు కూడా బలవంతం చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే.. మీనా సైతం ఈ వార్తలను పలుమార్లు ఖండించింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుకార్లను సృష్టించవద్దంటూ వారిని కూడా ఇచ్చింది. అయినా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి.