Banking Rights: దేశంలోని ప్రతి వ్యక్తికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల కోసం ఈ అకౌంట్‌ను ఉపయోగిస్తాడు. బ్యాంకుకు సంబంధించిన అన్నిరూల్స్ ప్రతి ఖాతాదారుడు పాటిస్తాడు.
అంతేకాదు బ్యాంకుకు వెళ్లినప్పుడు అక్కడ బ్యాంకు నియమ నిబంధనల గురించి సూచించే బోర్డులు కూడాపెడుతారు. కానీ చాలామంది ఖాతాదారులకు తమకు బ్యాంకులో లభించే హక్కుల గురించి తెలియదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి ఖాతాదారుడికి బ్యాంకులో చాలా రకాల హక్కులు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
బ్యాంకు నిబంధనలు
వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల కోసం కొన్ని నియమాలు సెట్ చేసింది. ఇందులో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో తెలియజేశారు. బ్యాంకు ఉద్యోగి ఎవరైనా అనవసరంగా వేధిస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీకు సరైన పత్రాలు, భారతీయ పౌరసత్వం ఉంటే ఏ బ్యాంకులో అయినా సులభంగా ఖాతా తెరవవచ్చు. అధికారులు ఒప్పుకోపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
1. BSBDలోని మొత్తం అంటే బేసిక్ ఖాతా జీరోగా మారినట్లయితే బ్యాంక్ మీ ఖాతాను క్లోజ్ చేయకూడదు.
2. మీరు మీ బ్యాంక్ ఖాతాను తిరిగి ఓపెన్ చేసినట్లయితే బ్యాంక్ మీకు ఎలాంటి అదనపు రుసుము విధించదు.
3. చిరిగిన లేదా పాత నోటును ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే మీరు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. దానిని మార్చడానికి బ్యాంకు నిరాకరించకూడదు.
4. బ్యాంకులు వృద్ధులు, వికలాంగులకు అన్ని రకాల లావాదేవీల సౌకర్యాలను సింగిల్ విండోలో అందించాలి.
5. చెక్కుల సేకరణకు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే బ్యాంకు ఖాతాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
6. బ్యాంకు నుంచి రుణం తీసుకునేటప్పుడు ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చినట్లయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన 15 రోజులలోపు అతడి సెక్యూరిటీని తిరిగి అందించాలి.
7. టర్మ్ డిపాజిట్‌ను ముందస్తుగా విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ఎవరినీ తిరస్కరించకూడదు. టర్మ్ పూర్తయ్యేలోపు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
8. బ్యాంక్ మీకు ఇచ్చిన కార్డు మీ అనుమతి లేకుండా యాక్టివేట్ అయి దాని నుంచి డబ్బులు డ్రా చేస్తే మీకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.