Vastu Tips: చీపురు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వెంటనే అలర్ట్ అవ్వండి..

www.mannamweb.com


భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ పాటిస్తుంటారు.
టీవీ, ఫ్రిడ్జ్‌, బీరువా ఇలా ప్రతీ వస్తువును ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలన్న అంశాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా ప్రస్తావించారు. అయితే చివరికి చీపురు కూడా ఏ దిశలో ఉంచాలన్న విషయాన్ని కూడా వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఇంతకీ చీపురు విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే నత్యవసర వస్తువుల్లో చీపురు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు. అలాంటి చీపురుకు సంబంధించి వాస్తు నియమాలు కూడా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. చీపురుని లక్ష్మీ దేవీగా భావిస్తుంటారు. అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఇంట్లో సరైన దిశలోనే ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కేవలం పశ్చిమదిశలో మాత్రమే ఉంచాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే చీపురుని పెట్టడానికి నైరుతి దిశ కూడా అనువైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ దిశలో కాకుండా మరే దిశలో ఉంచినా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందిన హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. ముఖ్యంగా బయటి వ్యక్తులకు ఇంట్లో ఉపయోగించే చీపురు కనిపించకూడదని చెబుతున్నారు.