Dates: ఖర్జూర పండ్లు తినే పద్ధతి ఇది.. 99 శాతం మంది చేసే తప్పేంటో తెలుసా..

www.mannamweb.com


మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో పాటు డ్రైఫ్రూట్స్ తినాలని న్యూట్రిషనిస్టులు సజెస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా, బ్యాలెన్స్‌డ్ డైట్‌లో ఖర్జూరం (Dates) తప్పక ఉండాలని చెబుతుంటారు.
ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, విటమిన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే, ప్రతిరోజు ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. అయితే, వీటిని తినే విషయంలో చాలా మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తుంటారు. రాంగ్ టైంలో, రాంగ్ వేలో వీటిని తినడం ఆరోగ్యానికి మరింత హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఖర్జూరాలను ఎప్పుడు, ఎలా తినాలో తెలుసుకుందాం.

ఈ టైంలో అస్సలు తినొద్దు!
ఖర్జూరాలను తినే టెక్నిక్ గురించి ప్రముఖ వైద్య నిపుణులు ప్రశాంత్ దేశాయ్ ‘ఏక్ ఝలక్ ఇంగ్లిష్’ వెబ్‌సైట్‌తో మాట్లాడారు. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలను తింటే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకొచ్చారు. పరగడుపున ఖర్జూరంతో పాటు మరో మూడు ఐటెమ్స్‌ అస్సలు తినకూడదని సజెస్ట్ చేశారు. రాంగ్ టైంలో వీటిని తినడం వల్ల బెనిఫిట్స్‌కి బదులు హెల్త్ సమస్యలు వస్తాయన్నారు. ఖాళీ కడుపుతో తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఆయన వివరించారు.

ఖర్జూరాల్లో 90 శాతానికి పైగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఉదయం లేవగానే, ఖాళీ కడుపుతో వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం దారితీస్తుంది.

ఏం చేయాలి మరి?
ఆరోగ్యానికి ఖర్జూరం ముఖ్యమే కానీ, వీటిని పరగడుపున కాకుండా మిగతా వేళల్లో తినాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. డేట్స్‌తో దేశీయ నెయ్యి కలిపి తింటే శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయి. దీంతో పాటు బాదం, జీడిపప్పు వంటి నట్స్‌తో కలిపి ఖర్జూరం తిన్నా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అయితే, ఖర్జూరంతో పాటు ఉదయం ఈ 3 రకాల ఐటెమ్స్‌ అస్సలు ముట్టుకోకూడదు.

టీ, కాఫీ
ఉదయమే టీ, కాఫీలు తాగడం చాలామందికి అలవాటు. అవి లేనిదే వారికి రోజు స్టార్ట్ కాదు. అయితే, ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఇన్సులిన్ లెవెల్స్‌ ప్రభావితం చేసి బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. వీటికి బదులు పెసర్లు, వేరుశనగ వంటి స్ప్రౌట్స్‌ తినాలి.

బిస్కట్స్, టీ
ఛాయ్‌లో బిస్కట్ లేదా బ్రెడ్ లేదా టోస్ట్.. ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. అయితే, టీలో బిస్కట్ వేసుకుని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా, ఖాళీ కడుపుతో ఛాయ్, బిస్కట్ తింటే జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. ఉదయం డైలీ రొటీన్‌ని నెయ్యితో చేసిన పదార్థాలతో స్టార్ట్ చేయండి.

హెల్తీ హ్యాబిట్స్ అలవాటు
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగాలి. చలికాలంలో ఇది కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది. ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ కింద మీకు స్వీట్స్ తినాలని అనిపిస్తే తేనె, బాదంలతో స్టార్ట్ చేయాలి. తాజా పండ్లు, నట్స్‌తో రోజును మొదలు పెడితే డే మొత్తం యాక్టివ్‌గా ఉండొచ్చు.