విటమిన్ డి ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవి.. చలికాలంలో వీటిని అస్సలు మిస్ అవ్వకండి

www.mannamweb.com


విటమిన్ డి( Vitamin D ).. మన శరీరానికి అత్యంత అవసరమయ్యే పోషకాల్లో ఒకటి. విటమిన్ డిని ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా పొందుతాము. అయితే ప్రస్తుత చలికాలంలో ఎండ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.
ఈ క్రమంలోనే వింటర్ సీజన్ లో విటమిన్ డి లోపానికి గురవుతుంటారు. ఈ లోపాన్ని పూడ్చాలంటే విటమిన్ డి ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రై ఫ్రూట్స్( Dry fruits ) లో విటమిన్ డి ఉంటుంది. భారీ మొత్తంలో కాకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ లో చిన్న మొత్తంలో విటమిన్ డి ఉంటుంది.

ఈ డ్రై ఫ్రూట్స్ లో నిత్యం కనుక తీసుకుంటే విటమిన్ డి లోపానికి దూరంగా ఉండవచ్చు. మరి ఇంతకీ విటమిన్ డి కలిగి ఉన్న ఆ డ్రై ఫ్రూట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఆప్రికాట్స్( Apricots ).. విటమిన్ డి లభించే ఆహారాల్లో ఒకటి. రోజుకు రెండు నుంచి మూడు డ్రై ఆప్రికాట్స్ ను తీసుకుంటే విటమిన్ డి తో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ ను డైట్ లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు రెట్టింపు అవుతుంది. స్కిన్ హెల్తీ గా మారుతుంది.

అలాగే చలికాలంలో విటమిన్-డి కోసం మీరు డ్రై అంజీర్( Dry fig ) ను ఎంచుకోవచ్చు. నిత్యం రెండు నానబెట్టిన అంజీర్‌ను తీసుకుంటే విటమిన్ డి లోపానికి గురికాకుండా ఉంటారు. అదే సమయంలో అధిక బరువు సమస్య దూరం అవుతుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. దంపతుల్లో సంతాన సమస్యలు తగ్గుతాయి. బాదం పప్పులో(almonds ) కూడా కొద్ది మొత్తంలో విటమిన్ డి ఉంటుంది. అందువల్ల నిత్యం 5 బాదం పప్పులను నానబెట్టి తీసుకోవాలి. బాదం పప్పు బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తుంది. మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ను రెట్టింపు చేస్తుంది. జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది. ఇక ఎండు ద్రాక్షలో కూడా విటమిన్ డి ఉంటుంది.
నిత్యం పది ఎండుద్రాక్షలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా విటమిన్ డి లోపానికి దూరంగా ఉండవచ్చు. అదే సమయంలో ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది. జుట్టు రాలడాన్ని సైతం నిరోధిస్తుంది.