Bank Jobs: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఉద్యోగాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం..

www.mannamweb.com


నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్ సాధించే అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వివిధ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది.
సాధారణంగా బ్యాంక్ ఉద్యోగాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. కానీ ఎస్బీఐ ఎస్‌సీఓ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in విజిట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ కింద SBI మొత్తం 150 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు కాగా, ఒకటి డిప్యూటీ మేనేజర్ (ఆర్కైవిస్ట్) జాబ్ రోల్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ 2025, జనవరి 3న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జనవరి 23 వరకు అవకాశం ఉంది.

అర్హతలు
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా విభాగంలో) పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు, ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. అభ్యర్థుల వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు
ఎస్బీఐ ఎస్‌సీఓ పోస్టులకు అప్లై చేసే జనరల్/EWS/OBC అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తాన్ని డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అయితే, SC/ST/PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

అప్లికేషన్ ప్రాసెస్

– SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in విజిట్ చేసి, హోమ్‌పేజీలో “కెరీర్స్” లింక్‌పై క్లిక్ చేయండి.

– దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో “కరంట్ ఓపెనింగ్” సెక్షన్‌కు వెళ్తే, “SBI SCO రిక్రూట్‌మెంట్ 2025” లింక్‌ కనిపిస్తుంద. దీనిపై క్లిక్ చేయండి.

– ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ నింపండి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయండి.

– భవిష్యత్తు అవకసరాల కోసం ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

సెలక్షన్ ప్రాసెస్
అప్లై చేసుకున్న అభ్యర్థులను అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఫైనల్ చేస్తారు.

జీతం ఎంత?
SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లకు మంచి జీతాలు లభిస్తాయి. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లకు స్కేల్ II కింద నెలకు రూ. 64,820 నుంచి రూ.93,960 వరకు జీతం ఉంటుంది. వీరి ప్రొబేషన్ పీరియడ్ 6 నెలలు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కూడా ఇదే పేస్కేల్ వర్తిస్తుంది, కానీ వీరికి ప్రొబేషన్ పీరియడ్ లేదు.