హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు.. ప్రభుత్వం డేంజర్ బెల్స్!

www.mannamweb.com


చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులో మన దేశంలో కూడా నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో దీనికి సంబంధించిన కేసులు పదికి పైగానే నమోదయ్యాయి.

దీంతో దేశ ప్రజలందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. మళ్ళీ కరోనా నాటి పరిస్థితులు వస్తాయా? మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా అని అందరూ భయపడుతున్నారు. ఎక్కడ ఈ వైరస్ మన తెలుగు రాష్ట్రాలకు వస్తుందోనని కంగారు పడుతున్నారు.

ఇప్పటికే ఈ వైరస్ కేసులు ఎక్కువగా ప్రభావం చూపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆంక్షలు కూడా విధించారు. ఎక్కడ ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందని భయపడ్డారు.

హైదరాబాద్‌లో 11..

అందరూ కంగారు పడినట్లే హైదరాబాద్‌కు కూడా ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తాయి. హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబ్‌లో 11 HMPV వైరస్ కేసులు బయటపడినట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్‌లో వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధ పడుతూ ఈ ల్యాబ్‌కు వచ్చిన 258 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 11 మందికి ఈ వైరస్ సోకిందని వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

శుభవార్త ఏంటంటే?

అయితే ఈ విషయంలో హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వైరస్ సోకిన వ్యక్తులందరూ విజయవంతంగా చికిత్స తీసుకున్నారని, వారంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని, వారంతా ఆరోగ్యంగానే డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దీంతో ఈ వార్త విన్న ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం ఏమి లేదు..

అందరూ అనుకుంటున్నట్లు ఈ వైరస్ అంత ప్రమాదకరం ఏమి కాదని హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబ్ ప్రతినిధులతో పాటు డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇది సాధారణమైన ఫ్లూ మాత్రమేనని, బయట వస్తున్న పుకార్లను ఏ మాత్రం నమ్మకూడదని తెలిపారు. ఈ వైరస్ కేసులో ఇండియాలో కొత్తేది కాదని, ఎప్పటి నుంచో ఉందని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.