ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్షలు ఇక లేవట!

www.mannamweb.com


ఇంటర్ విద్యార్థుల పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వల్ల విద్యార్థుల్లో గల మానసిక ఆందోళనను కాస్తైనా తొలగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకు ఆ నిర్ణయం ఏమిటి? ఇది వాస్తవమా? కాదా అనే విషయాలను తెలుసుకుందాం.

ఏపీలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పాఠశాలలో పెద్ద పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో మానసికస్యం కల్పించడంతోపాటు, పాఠశాలల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు గురించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారా లోకేష్ సందర్శిస్తూ, విద్యార్థుల నుండి పాఠశాలల అధిక సంబంధిత పలు అంశాలను ఆరాతీస్తున్నారు.

ఈ దశలో ఏపీలో 10వ తరగతి పబ్లిక్, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్ విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా తయారు చేసినట్లుగా చెప్పవచ్చు. ప్రతి పరీక్షకు ఒకటి లేదా రెండు రోజులు కాల వ్యవధి ఉంచి, విద్యార్థులు మరింతగా సమయం తీసుకుని ఉన్నత మార్కులు సాధించేలా షెడ్యూల్ ప్రకటించారు.

తాజాగా విద్యావ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రభుత్వం ఓ సూచన చేసింది. రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను పూర్తిగా తొలగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని, రెండు సంవత్సరాలు పరీక్ష నిర్వహించడం ద్వార, విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అలాగే ఉన్నత విద్య వైపు మక్కువ చూపడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విధానం అమలు చేసేందుకు ఈనెల 26 వరకు విద్యార్థులు తల్లిదండ్రుల నుండి తగిన సలహాలు సూచనలను తీసుకోనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా 2025 – 26 విద్యా సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే అమలైతే ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై ఉన్న ఆందోళన కాస్త తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు.