ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్న IRCTC.. విదేశాలకు వెళ్లేవారి కోసం అందుబాటు ధరలో అద్భుతమైన టూర్ ప్యాకేజీ అనౌన్స్ చేసింది.
ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC. ప్రయాణీకుల కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్న ఈ సంస్థ ప్రపంచాన్ని చుట్టేసే ఖతర్నాక్ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది.
విదేశాలకు వెళ్లాలనే కలను నెరవేర్చే దిశగా, అందుబాటు ధరలో అద్భుతమైన టూర్ ప్యాకేజీ అనౌన్స్ చేసింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఈ టూర్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీని SIZZLING DUBAI విత్ అబుదాబి ఎక్స్ లక్నో (NLO26)తో ప్రకటిచింది IRCTC. 7 రోజులు, 6 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
ఈ టూర్ లో మిరాకిల్ గార్డెన్, మెరీనా క్రూయిజ్ రైడ్, ఫ్యూచర్ మ్యూజియం, బుర్జ్ ఖలీఫా, బెల్లీ డ్యాన్స్ వంటి వాటిని చూడొచ్చు. ఇందుకోసం లక్నోకు వెళ్లాల్సి ఉంటుంది. కాన్వాయ్ జనవరి 17, 2025న 21:55కి లక్నో విమానాశ్రయం నుండి బయలుదేరి 00:55కి షార్జా విమానాశ్రయానికి చేరుతారు.
అల్పాహారం, భోజనం నుండి రాత్రి భోజనం వరకు అన్ని ఖర్చులు ఈ ప్యాకేజీలో యాడ్ అవుతాయి. టూర్ గైడ్‌తో పాటు మంచి హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు.