బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది. ఈ రూ. 439 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రైజ్ సెన్సిటివ్ మార్కెట్‌పై ఫోకస్ చేసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. అత్యంత సరమైన 90 రోజుల వాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. టెలికాం స్పేస్‌లో 90 రోజుల వాలిడిటీతో, తక్కువ ధరకే లభిస్తున్న ప్లాన్ ఇదే కావడం విశేషం. 4జీ సేవల విస్తరణ నేపథ్యంలో ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీనిచ్చే విధంగా ఈ బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇక ఈ రూ. 439 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
బీఎస్ఎన్ఎల్ ఎస్టీవీ 439: పూర్తి వివరాలు..
ఎక్కువ కాల వ్యవధి, తక్కువ డబ్బు ఖర్చు ప్లాన్స్‌ని కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 439 ప్రీపెయిడ్ ప్యాక్‌ని తీసుకొచ్చింది. ఈ వాయిస్-ఫోకస్డ్ ప్లాన్‌లో ఏం ఉంటాయంటే..
అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్: ఏ నెట్‌వర్క్‌కైనా నిరంతరాయంగా కాల్స్ చేసుకోవచ్చు.
300 ఎస్ఎంఎస్లు: మొత్తం వ్యవధికి తగినంత మెసేజింగ్ అలవెన్స్‌తో కనెక్ట్ అవ్వండి.
అయితే, ఈ ప్లాన్‌లో డేటా ప్రయోజనాలు లేవు! కానీ వినియోగదారులకు అవసరమైన విధంగా సరసమైన డేటా ప్యాక్లను జోడించే సౌలభ్యం బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. సరసమైన ధరకు డేటా ప్యాక్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాయిస్ సేవలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి లేదా సెకండరీ సిమ్‌ని మేనేజ్ చేయడనికి ఇది అద్భుతమైన ఆప్షన్.
ఇటీవలి కాలంలో ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 439 రీఛార్జ్ ప్లాన్ అనేది అధిక ఖర్చులు లేకుండా ప్రాథమిక కనెక్టివిటీ కోసం చూస్తున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. జియో, ఎయిర్టెల్, వీఐ వంటి ప్రైవేట్ టెల్కోలు బండిల్డ్ బెనిఫిట్స్‌తో అధిక ధరల ప్లాన్లపై దృష్టి సారిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ కొత్త వైర్లెస్ చందాదారులను ఆకర్షించడానికి ఇలాంటి ప్యాక్స్‌ని తీసుకొస్తోంది.
అంతేకాదు, ప్రైవేట్ టెల్కోల్లో ఏ ఒక్కటి కూడా ఇలాంటి చౌకైన 90 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లను అందించడం లేదు. ప్రైజ్ సెన్సిటివ్ మార్కెట్‌ని వశం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా రీఛార్జ్ ప్యాక్‌తో కనిపిస్తోంది. నిత్యావసర కాలింగ్, మెసేజింగ్ సేవలను ఆస్వాదిస్తూనే తమ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని కోరుకునే వినియోగదారులను ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో టెలికాం రంగంలో సంస్థ స్థానాన్ని బలోపేతం అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. హైస్పీడ్ నెట్వర్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, రూ .439 వాయిస్ వోచర్ వంటి బీఎస్ఎన్ఎల్ పోటీ ధర ప్లాన్లు ప్రైవేట్ సంస్థలకు తీవ్రమైన సవాలుగా ఉంటాయి అని అనడంలో సందేహం లేదు.