తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించే ఈ నటుడు తాజాగా చాలా సిక్ అయినట్టు తెలుస్తోంది.
కనీసం నడవడానికి, మైక్ పట్టుకోడానికి కూడా వణికే పరిస్థితికి వచ్చాడు. మరి విశాల్ కు ఏమైంది. మరి ఆ పరిస్థితుల్లో విశాల్ ను చూసి ఆ నటి సంబరపడిపోయి దారుణంగా తిట్టిపోసింది. ఆమె అలా ఎందుకు చేసింది, ఆ వివరాలు ఏంటో చూద్దాం..
‘మదగజ రాజ’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాల్ వచ్చారు. ఇక్కడ ఆయన చాలా సిక్ అయిపోయినట్టు కనిపించారు. చాలా అస్వస్థతతో కనీసం మైక్ పట్టుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశాల్ ను చూసినటువంటి సుచిత్ర సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే విధంగా ఒక పోస్ట్ చేసింది.. విశాల్ వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తెలియజేసింది.. (Suchitra)
చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకు ఒకటి చెప్తాను అంటూ.. ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినబడింది. వెంటనే వెళ్లి తలుపు తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్ తో నిలబడి ఉన్నాడు. కార్తీక్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు లేడు అని చెప్పాను, అందుకే వచ్చానని మళ్లీ అన్నాడు. నన్ను లోపలికి రానివ్వమని అడగగానే నేను నిరాకరించి, గౌతమ్ ఆఫీసుకు వెళ్ళమని చెప్పి తలుపు మూసి వేశాను. అలా ఆరోజు నన్ను చాలా టార్చర్ పెట్టాడని సుచిత్ర తెలియజేసింది.
ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం విశాల్ తీవ్రమైన జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ కు రావాలని బ్రతిమిలాడడంతో అలా వచ్చి వెళ్లిపోయారట.. దీంతో సుచిత్ర ఈ విధంగా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Suchitra)