మారుతి వినియోగదారులకు సంక్రాంతి బంఫర్ ఆఫర్..

www.mannamweb.com


దేశంలో Maruthi కార్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ కారు రిలీజ్ అయినా వెంటనే కొనడానికి ముందుకు వస్తారు. మారుతి నుంచి హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే కాకుండా ప్రీమియం కార్లు కూడా మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. వీటిపై తాజాగా Company భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

దేశంలో Maruthi కార్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ కారు రిలీజ్ అయినా వెంటనే కొనడానికి ముందుకు వస్తారు. మారుతి నుంచి హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే కాకుండా ప్రీమియం కార్లు కూడా మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. వీటిపై తాజాగా Company భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా కొన్ని కార్లను తక్కువ ధరకు ఇవ్వడమే కాకుండా మరికొన్ని కార్లపై భారీగా Discounts ప్రకటించింది. వీటిలో ఎస్ యూవీ వేరియంట్లు కూడా ఉన్నాయి. కొత్తగా కారుకొనాలని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం అని కొందరు అంటున్నారు. ఇంతకీ మారుతి కంపెనీ ఏ కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించిందో చూద్దాం..

Maruthi కార్లు అంటే కొందరిక మహా మోజు. దీని నుంచి రిలీజ్ అయ్యే ఏ కారు అయినా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. వీటిలో మారుతి ఇన్విక్టో గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.25.05 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.28.72 లక్షల వరకు విక్రయిస్తన్నారు. 2023, 2024 మోడల్ అయిన ఇన్విక్టోపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు ధరను ప్రకటించారు. ఇదే 2025 మోడల్ పై 1.15 లక్షలకు తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో ఇన్విక్టో ఏ కారు కొన్నా.. భారీగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

మారుతి నుంచి మొట్ట మొదటి SUV గ్రాండ్ విఠారా. ఇది ప్రస్తుతం మార్కెట్లో రూ.10.88 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉంది. టాప్ ఎండ్ 19.97 లక్షలతో విక్రయిస్తున్నారు. గ్రాండ్ విఠారా 2023, 2024 మోడల్ కొనుగోలు చేసేవారికి రూ.1.18 లక్షల తగ్గింపు ధరతో విక్రయిస్తారు. 2025 మోడల్ అయితే రూ.93 వేలు ఆదా చేసుకోవచ్చు. ఎస్ యూవీ కారు కొనాలని చూసే వారికి ఇది శుభవార్తే అని కొందరు అంటున్నారు.

హ్యాచ్ బ్యాక్ కార్లలో మారుతి బాలెనో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ మోడల్ పై కూడా తగ్గింపు ధరను ప్రకటించారు. బాలెనో ప్రస్తుతం మార్కెట్లో రూ.8.00 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. బాలెనో 2024, 2024 మోడల్ పై రూ. 62 వేల తగ్గింపును ప్రకటించింది. 2025 కారును కొనాలని చూస్తే రూ. 42 వేలు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్ కు పోటీగా వచ్చిన జిమ్నీ ప్రత్యేకత సాధించుకుంది. ఈ కారుపై తాజాగా డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ కారును హైదరాబాద్ లో అయితే రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు 2023, 2024 మోడళ్లపై రూ.1.90 లక్షల భారీ తగ్గింపును ప్రకటించింది. 2025 మోడల్ విషయానికొస్తే రూ.25,000 తగ్గింపును ప్రకటించింది.

ఇవే కాకుండా మారుతికి చెందిన ప్రీమియం కారు ఫ్రాంక్స్ 2023, 2024 మోడళ్లపై రూ.60,000 తగ్గించింది. 2025 మోడల్ పై రూ.30 వేల తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ఇదే కంపెనీకి చెందిన ఇగ్నీస్ పై గత రెండేళ్ల మోడళ్లపై రూ.77,100 ఉండగా.. 2025 మోడల్ పై రూ.52,100 తగ్గింపు ధరతో విక్రయిస్తున్నారు.