గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్‌ఫుల్, యాక్షన్ ప్యాక్డ్ మూవీ గేమ్ ఛేంజర్.. థియేటర్లలోకి వచ్చేసింది. చెర్రీ ఫ్యాన్స్‌కి అప్పుడే సంక్రాంతి పండుగ వచ్చేసింది.
ఈ సంక్రాంతికి ముందుగా రిలీజైన ఈ భారీ సినిమాకి తెల్లవారు జాము నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఏ థియేటర్ దగ్గర చూసినా.. ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో, చూసిన వాళ్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఈ సినిమాలో రామ్ చరణ్ వన్ మాన్ షో లాగా నడిపించాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. విభిన్న పాత్రల్లో ఒదిగిపోతూ.. నటనలో మరో మెట్టు పైకి ఎక్కాడని అంటున్నారు. ముఖ్యంగా ఇది గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్‌కి కెరీర్ ఛేంజర్ కూడా అని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. దర్శకుడు శంకర్ మరోసారి తన మార్క్ చూపించి.. కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. కథ, కథనం, నటీ నటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా అద్భుతమైన సినీమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అంటున్నారు.
రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చించేశాడనీ, సన్నివేశాలకు తగినట్లుగా ఒక్కోసారి డౌన్ అవుతూ, ఒక్కోసారి హై పిచ్‌కి వెళ్తూ.. నటనలో ఎంతో వైవిధ్యం చూపించాడని చెబుతున్నారు.