గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇక అసలైన పనులు !

www.mannamweb.com


పంచాయతీలను పట్టించుకోకుండా వాటి అధికారాలను లాక్కుని ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను ఓ దారికి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ సచివాలయాల్లో ఉన్న వారికి ఇప్పటికీ పనుల్లేవు.

దీంతో ప్రభుత్వం పంచాయతీలకే పెత్తనం ఇవ్వాలని భావిస్తోంది. పంచాయతీ కార్యదర్శి కనుసనల్లో ప్రజలకు సచివాలయాల సిబ్బందిని మార్చాలని అనుకుంటున్నారు. అయితే అసలు గ్రామ సచివాలయాల ఏర్పాటే అసంబద్ధంగా ఉంది. అవసరమైనంత సిబ్బందిని కూడా నియమించలేదు. ఈ కారణంగా హేతుబద్దీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.

రెండున్నర వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం లేదా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒకటి ఉండేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు, ఈ అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత ఉంది. అందుకే కార్యాచరణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల్లో ఉండే పది మంది ఉద్యోగులకు ఎలాంటి పని ఉండటం లేదు. ఆ పనులను గ్రామాల్లో పంచాయతీ, పట్టణాల్లో మున్సిపల్ ఉద్యోగులు పూర్తి చేస్తున్నారు. పరిమితుల కారణంగా గ్రామ సచివాలయాలకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది.

జగన్ తీసుకు వచ్చిన అనాలోచిత ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు పెట్టుకున్న వ్యవస్థల్లో వాలంటీర్లు, ఈ గ్రామ సచిలయాలు రెండు. గ్రామ పంచాయతీల్లో జరిగే పనులు.. మున్సిపల్ అధికారులు చేయాల్సిన పనులను.. ఈ రెండింటికీ బదలాయించి.. అధికార వ్యవస్థను అతలాకుతలం చేశారు. ఎంత దారుణమైన నిర్ణయాలు అంటే.. రిజిస్ట్రేషన్లు కూడా అక్కడే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాటికి కూడా విలువ లేకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ సచివాలయాలను.. ఆ ఉద్యోగుల విధులను హేతుబద్దీకరణ చేసి.. కనీసం ఆ వ్యవస్థను ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నారు.