ఎస్బీఐ స్కీమ్ అదుర్స్.. రూ. 10 వేల సిప్‌తో చేతికి రూ. 98 లక్షలు.. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే?

www.mannamweb.com


స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇన్వెస్ట్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ లాంగ్ రన్‌లో అద్భుత రీతిలో రిటర్న్స్ అందుకోవచ్చు. ముఖ్యంగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ కీలకంగా ఉంటుంది. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. అంటే.. వడ్డీపై వడ్డీ అందుకోవచ్చు. అందుకే ఇక్కడ ఆరంభ సంవత్సరాల్లో కంటే కాలం గడుస్తున్న కొద్దీ మంచి లాభాలు వస్తుంటాయని చెప్పొచ్చు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏక కాలంలో లేదా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా మంది సిప్‌వైపు మొగ్గుచూపుతుంటారు. క్రమపద్ధతిలో ప్రతి నెలా కొంత మొత్తం ఆదా చేసి పెట్టుబడి పెట్టడం కాస్త బెటర్ అని చాలా మంది అనుకుంటుంటారు.

ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగిస్తే ద్రవ్యోల్బణానికి మించిన రిటర్న్స్ ఆశించవచ్చు. ఇక వీటిల్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ రాబడి ఉంటుందని చెప్పొచ్చు. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్.. ప్రముఖ హెవీ వెయిట్ స్టాక్స్‌లో ఇన్వె్స్ట్ చేయడం ప్రధాన కారణం. వీటిల్లో పెద్దగా ఫ్లక్య్చువేషన్స్ ఉండవు.

ఇప్పుడు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కేటగిరీకి చెందిన ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ లార్జ్ క్యాప్ ఫండ్ 2006, ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. అప్పటినుంచి స్థిరంగా లాభాలు అందిస్తోంది. లాంఛింగ్ నుంచి సగటున ఇది 12.18 శాతం రిటర్న్స్ అందించింది. ఇది దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చేందుకు ఉద్దేశించిన స్కీమ్. లార్జ్ క్యాప్ ఈక్విటీ స్టాక్స్‌లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ డొమెస్టిక్ ఈక్విటీల్లోనే 95.35 శాతం వాటా కలిగి ఉంది. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అత్యధికంగా 64.97 శాతం ఇన్వెస్ట్ చేసింది. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో 7.81 శాతం, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో 1.66 శాతం వాటా ఉంది.

ఈ ఫండ్ సగటున ఐదేళ్లకు అత్యధికంగా 16.10 శాతం రిటర్న్స్ ఇచ్చింది. స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి అంటే 19 ఏళ్లలో 12.18 శాతం చొప్పున లాభాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2006లో పథకం ఓపెన్ అయినప్పటి నుంచి రూ. 10 వేల సిప్ చేసిన వారికి ఇప్పుడు చేతికి రూ. 98.54 లక్షలు వచ్చాయి. అదే ఏకమొత్తం ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ అంటే రూ. లక్ష పెట్టిన వారికి 19 ఏళ్లలో రూ. 8.77 లక్షలు వచ్చాయి. ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌లో ఎక్కువ (9.84 శాతం) ఇన్వెస్ట్ చేసింది. తర్వాత వరుసగా ఐసీఐసీఐ బ్యాంక్ (7.47 శాతం), ఇన్ఫోసిస్ (5.04 శాతం), ఐటీసీ (4.75 శాతం), లార్సెన్ అండ్ టుబ్రో (4.57 శాతం) ఉంది. ఈ ఫండ్ నికర ఆస్తుల విలువ (AUM) రూ. 50,502 కోట్లు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్.