మూత్రంలో మంట, నొప్పి, యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా శరీరంలో వేడి ఉండదు..ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
ఆ సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన శ్రద్ద తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఈ మధ్య మనలో చాలా మంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అలా కాకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
దీని కారణంగా పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా త్వరగా తగ్గుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది,
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పటికబెల్లం, పావు స్పూన్ ఉప్పు వేసి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది.
ఈ నీటిని తాగటం వలన యూరిన్ ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కరుగుతాయి. ధనియాలు,పటికబెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ధనియాలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. అలాగే మంచి నీటిని ఎక్కువగా తాగాలి. ఆకుకూరలు,పండ్లను తప్పనిసరిగా తినాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.