ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం

www.mannamweb.com


ఇన్‌కమ్, క్యాస్ట్, బర్త్, డెత్, ఫ్యామిలీ వంటి సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంతలా తిరగాలో అందరికీ తెలిసే ఉంటుంది. మనం వెళ్లినప్పుడు అధికారి ఉండరు..

అధికారి ఉన్నప్పుడు మనం వెళ్ళం. పోనీ ఉన్నా రేపు రాపో.. మాపు రాపో అంటుంటారు. దానర్థం ఎంతో కొంత ఇవ్వు అని. ఇవ్వకపోయావా..! నీ సర్టిఫికేట్ చేతికొచ్చేసరికి నెల నుంచి నెలన్నర రోజుల సమయం పడుతుంది. మున్ముందు అటువంటి కష్టాలకు తావులేకుండా ఏపీప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ALSO READ | కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ.. ఎందుకంటే..?

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సప్‌ గవర్నెర్స్ అందుబాటులోకి తేనుంది. జనవరి 18 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బర్త్, డెత్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ విధానంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. లంచాల బాధ తప్పుతుంది. అదే సమయంలో ఎక్కడినుంచైనా ఈ సేవలు పొందవచ్చు.. సమయం ఆదా చేసుకోవచ్చు.