దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సూపర్‌హిట్ స్కీమ్ లాంచ్ చేసింది. ఆ వివరాలు చూద్దామా..
ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలంటే అంతా కూడా ముందుగా ఆలోచించేది రిస్క్ గురించే. పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండటమే కాదు, దానిపై స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాల కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బెస్ట్ ఆప్షన్ అయ్యాయి.
తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లు లాంచ్ చేస్తున్నాయి పలు బ్యాంకులు. ఇందులో భాగంగానే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సూపర్‌హిట్ స్కీమ్(FDs)ను లాంచ్ చేసింది.
ఇందులో మీరు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ టెన్యూర్స్‌లో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ వ్యవధి ముగింపులో, మీరు సంపాదించిన వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని అందుకుంటారు. ఇప్పుడు ఈ స్కీమ్‌లో ఆయా టెన్యూర్స్‌లో రూ.10 లక్షల పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు చూద్దాం.
1 సంవత్సరం టెన్యూర్ చూస్తే.. మీరు 1 సంవత్సరానికి ఎస్‌బీఐ సూపర్‌హిట్ స్కీమ్‌లో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే 6.80% వడ్డీ రేటు అందుతుంది. సంవత్సరం చివరిలో మీరు రూ.69,753 వడ్డీని ఆర్జిస్తారు. మీ మెచ్యూరిటీ మొత్తం రూ.10,69,753 అవుతుంది.
2 సంవత్సరాల టెన్యూర్.. ఈ స్కీమ్‌లో 2 సంవత్సరాలపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 7.00% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ కాలానికి రూ.10 లక్షలకు మీరు రూ.1,48,881 వడ్డీని పొందుతారు. అంటే 2 సంవత్సరాల తర్వాత మీ మెచ్యూరిటీ మొత్తం రూ.11,48,881 అవుతుంది.
3 సంవత్సరాల టెన్యూర్.. మీరు 3 సంవత్సరాల పాటు రూ.10 లక్షలు ఎఫ్‌డీ చేయాలని భావిస్తే, 6.75% వడ్డీ రేటు అందుకోవచ్చు. ఈ టెన్యూర్‌లో రూ.2,22,393 వడ్డీని పొందుతారు. 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.12,22,393 అందుకుంటారు.
5 సంవత్సరాల టెన్యూర్.. ఈ స్కీమ్ ఐదేళ్ల టెన్యూర్ సెలక్ట్ చేసుకుంటే, మీకు 6.50% వడ్డీ రేటు లభిస్తుంది.. ఈ కాలంలో రూ.10 లక్షల డిపాజిట్‌పై మీరు రూ.3,80,419 వడ్డీని పొందుతారు. ఫలితంగా 5 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ రూ.13,80,419 అవుతుంది.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు: ఎస్‌బీఐ ఈ స్కీమ్‌లో అన్ని ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 0.50% ఎక్కువ వడ్డీని అందిస్తోంది. అంతేకాకుండా ‘ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్’ పథకం కింద, సీనియర్ సిటిజన్‌లు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 0.50% అదనపు వడ్డీని అందుకుంటారు. అంటే మొత్తం 1% అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఉదాహరణకు, ఒక సీనియర్ సిటిజన్ 5 సంవత్సరాలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే, వారు రూ.4,49,948 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ మొత్తం రూ.14,49,948 అవుతుంది.