సంక్రాంతి(Sankranti)సంబరాలతో ఆంధ్రా(AP) ప్రజల సంతోషం ఏమోగాని కోడి పందాల (Cock Fighting)పేరుతో చాల మంది జేబులు ఖాళీ చేసుకుని బాధపడాల్సిన పరిస్థితుల్లో పడిపోతున్నారు.
కోడి పందాల్లో గెలుస్తామనుకున్న వారు ఓడిపోతూ పందెం సొమ్ము కోల్పోతున్నారు. కోడి పందాల్లో కింగ్ గా పేరు మోసిన ఏలూరు జిల్లా రంగాపురంకు చెందిన రత్తయ్య కోడి ఈ దఫా సంక్రాంతి కోడి పందాల బరిలో అనూహ్యంగా ఓటమి చవి చూసింది. ఈ దెబ్బకు రెప్పపాటులో రత్తయ్య పుంజుపై కాసిన పందెం సొమ్ము రూ. 20లక్షలు హుష్ కాకి అయిపోయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సంక్రాంతి వచ్చిదంటే రత్తయ్య పెంచిన పందెం కోళ్లకు భలే గిరాకీ ఉంటుంది. 20ఏళ్లుగా పందెం కోళ్లను పెంచుతున్న రత్తయ్య కోళ్లకు పందాల్లో సక్సెస్ రేటు అందరి కంటే అధికం. అలాంటి రత్తయ్య పందెం కోడి బరిలో కనీస పోటీ కూడా ఇవ్వకుండానే మట్టి కరవడంతో పందెం రాయుళ్లు 20 లక్షలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలో వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ లో చేతులు మారాయి.
సంక్రాంతిరి సొంతూర్లకు వెళ్లిన వారిలో కోడి పందాల మోజులో జేబులు ఖాళీ చేసుకున్న వారు లబోదిబో మంటుండగా, గెలిచినోళ్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రాలో 450 కి పైగా కోడి పందాల బరులు నిర్వహించగా..దాదాపు 500కోట్లకు పైగా బెట్టింగ్ లు జరిగినట్లుగా సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో నిర్వహించిన కోటీ రూపాయాల కోడి పందెం హాట్ టాపిక్ గా నిలిచింది. పోటీలో గుడివాడ ప్రభాకర్ రావు, రత్తయ్య నెమలి పుంజు, రసంగి పుంజులను బరిలోకి దింపగా. హోరాహోరిగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు గెలుపొంది. కోటి రూపాయల కోడి పందాన్ని వీక్షించేందుకు పందెంరాయుళ్లు, ప్రజలు భారీగా తరలివచ్చారు.