ఆటో ఎక్స్‌పోలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250R, XPulse 210 బైక్‌లు విడుదల..

హీరో మోటోకార్ప్ తన ఎక్స్‌ట్రీమ్ 250R ను ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 లో విడుదల చేసింది. ఇది యాక్సెంట్ 2.5R కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబడిన కరిజ్మా XMR 250 నేకెడ్ ఎడిషన్. ఈ బైక్ చాలా స్పోర్టీగా ఉంది. దానితో పాటు.. హీరో Xpulse 210 ను కూడా విడుదల చేసింది. దీని స్టైలింగ్ హీరో ఎక్స్‌పల్స్ 200 4V ని పోలి ఉంటుంది. దీని కొత్త ఫీచర్స్ తో కరిజ్మా XMR 210 నుండి తీసుకోబడిన ఇంజిన్ ఉంది. అయితే, ఈ రెండు బైక్‌ల ఫీచర్లు, ఇంజిన్ గురుంచి చూద్దాం.


XPulse 210 ధర, ఫీచర్లు

XPulse 210 బైక్ 210cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 24.6bhp శక్తిని, 20.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేయబడింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.76 లక్షలుగా కంపెనీ పేర్కొంది. దీని పనితీరు రోజువారీ ఉపయోగంలో, హైవేలో మెరుగ్గా ఉంటుంది.

ఈ డ్యూయల్-స్పోర్ట్ బైక్‌లో రౌండ్ LED హెడ్‌లైట్, పైన పారదర్శక వైజర్, LED టర్న్ ఇండికేటర్లు, ట్యూబులర్ హ్యాండిల్‌బార్లు, సింగిల్-పీస్ సీటు ఉన్నాయి. ఈ బైక్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు 4.2-అంగుళాల TFT కన్సోల్, LED లైటింగ్ ఉన్నాయి. సస్పెన్షన్ విధులను లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ చూసుకుంటాయి. దీనికి ముందు భాగంలో 21-అంగుళాల స్పోక్ వీల్స్, వెనుక భాగంలో 18-అంగుళాల స్పోక్ వీల్స్ వస్తాయి. బ్రేకింగ్ కోసం.. డ్యూయల్-ఛానల్ ABS తో డిస్క్ బ్రేక్ ఉంది.

ఎక్స్‌ట్రీమ్ 250r ధర, ఫీచర్లు

హీరో ఎక్స్‌ట్రీమ్ 250R కొత్త 250cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 30bhp పవర్, 25Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది LED DRL లతో కూడిన కోణీయ LED హెడ్‌లైట్, దృఢమైన ఇంధన ట్యాంక్, వెనుక భాగంలో LED టెయిల్‌ల్యాంప్ క్లస్టర్‌ను పొందుతుంది. అయితే నంబర్ ప్లేట్ స్వింగ్‌ఆర్మ్‌పై అమర్చబడి ఉంటుంది.

ఈ బైక్ స్ప్లిట్-సీట్, గ్రాబ్ రైల్, సిల్వర్ హీట్ షీల్డ్‌తో కూడిన ఎగ్జాస్ట్ పైపు, ప్రీ-లోడ్ సర్దుబాటుతో కూడిన బంగారు రంగు USD ఫోర్కులు, మోనో-షాక్ యూనిట్‌ను పొందుతుంది. దీనికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. బ్రేకింగ్ కోసం.. ABS తో కూడిన సింగిల్-డిస్క్, 17-అంగుళాల టైర్లతో అమర్చబడి ఉంటుంది. మోటార్ సైకిల్ Xtreme 250R కేవలం 3.25 సెకన్లలో 0 నుండి 60 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.80 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.