రూ.60 వేల 55 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.30 వేలకే

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 13వ తేదీన మొదలైన ఈ సేల్‌ 19వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సేల్‌లో స్మార్ట్‌ టీవీపై లభిస్తున్న బెస్ట్‌ డీల్‌ ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం..


Toshiba

అమెజాన్‌ గ్రేట్ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. గృహోపకరణాలు మొదలు అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై మంచి డీల్స్‌ లభిస్తున్నాయి. స్మార్ట్‌ టీవీలపై ఈ సేల్‌లో ప్రత్యేకంగా ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. సేల్‌లో భాగంగానే తోషిబా కంపెనీకి చెందిన టీవీపై మంచి డీల్‌ లభిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తోషిబా కంపెనీకి చెందిన 55 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీపై అమెజాన్‌ సేల్‌లో 43 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 59,999కాగా అమెజాన్‌లో 43 శాతం డిస్కౌంట్‌తో రూ. 33,999కే అందుబాటులో ఉంది.

అయితే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ టీవీపై అదనంగా మరో రూ. 1500 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ టీవీని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చన్నమాట. కొన్ని రకాల బ్యాంకులకు చెందిన డెబిట్‌ కార్డులతో ఈఎమ్‌ఐ ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం కూడా కల్పించారు.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 55 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని అందించారు. 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌తో కూడిన ఈ టీవీలో 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్‌, వైఫై, ఈథర్‌ నెట్‌, ఆప్టికల్ డిజిటల్‌ ఆడియో అవుట్‌పుట్‌ వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో 24 వాట్స్‌ ఆడియో అవుట్‌పుట్‌ డాల్బీ ఆటమ్స్‌, డాల్బీ డిజిటల్‌ వంటి సౌండ్‌ ఫీచర్లను అందించారు.

గూగుల్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ చేసే ఈ టీవీలో వాయిస్‌ కమాండ్, స్క్రీన్‌ మిర్రరింగ్‌, ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లను ఇచ్చారు. అలాగే ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌, హంగామా, జి5, జియో సినిమా వంటి ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో 178 డిగ్రీల వైడ్‌ వ్యూయింగ్‌ యాంగిల్‌ను అందించారు. తోషిబా కంపెనీ ఈ టీవీపై ఏడాది వారంటీ అందిస్తోంది. 4కే రిజల్యూషన్‌తో ఉండడంతో ఈ టీవీ డిస్‌ప్లే క్లారిటీ చాలా బాగుంటుంది. అందులోనూ ఇందులో స్మార్ట్ 4కే అనే టెక్నాలజీని అందించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.