స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. మీకోసం ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు బోలెడు మోడల్స్ మంచి డిస్కౌంట్లలో దొరుకుతున్నాయి.
కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునేవాళ్లకు ఇదే మంచి సమయమని చెప్పొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ధర తక్కువగా ఉంది కదా అని ఏ టీవీ పడితే అది కొనేసుకోవద్దు. కొన్ని చవకబారు మోడల్స్‌లో క్వాలిటీ ఉండకపోవచ్చు. సరిగ్గా పనిచేయకపోవచ్చు లేదా ఫీచర్లు కూడా తక్కువగా ఉండొచ్చు.
మీరు స్మార్ట్ కొనుగోలు చేయాలంటే, ధర ఒక్కటే కాదు, క్వాలిటీ, ఫీచర్ల మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే పెట్టిన పైసలకు పక్కాగా న్యాయం జరుగుతుంది. సరే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు మంచి స్మార్ట్ టీవీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇచ్చాం. వీటిని దృష్టిలో పెట్టుకుంటే డబ్బులు వృథా కాకుండా బెస్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
* డిస్ప్లే ప్యానెల్: బొమ్మ అదిరిపోవాలంటే ఇదే ముఖ్యం
టీవీ క్వాలిటీ అంతా దాని డిస్ప్లే ప్యానెల్‌పైనే ఆధారపడి ఉంటుంది. LCD, TFT, AMOLED, OLED, IPS, QLED.. ఇలా చాలా రకాల ప్యానెల్స్ ఉంటాయి. వీటిలో OLED, QLED ప్యానెల్స్ అయితే పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుంది. రంగులు కళ్లు చెదిరేలా ఉంటాయి, పిక్చర్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే IPS ప్యానెల్ ఉన్న టీవీలు కూడా మంచి క్వాలిటీతో వస్తాయి. సో, అవసరానికి తగ్గట్టు బెస్ట్ ప్యానెల్ ఉన్న టీవీని సెలెక్ట్ చేసుకోండి.
* సౌండ్ ఔట్పుట్
మంచి టీవీ అంటే పిక్చర్ ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే ముఖ్యం. కనీసం 30W సౌండ్ ఔట్పుట్ ఉన్న టీవీని ఎంచుకోవాలి. అప్పుడే సౌండ్ క్లియర్‌గా, లౌడ్‌గా వినిపిస్తుంది. ఒకవేళ టీవీ సౌండ్ అంతంతమాత్రంగా ఉంటే, ఎక్స్ట్రాగా స్పీకర్లు లేదా సౌండ్‌బార్ కొనుక్కోవాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త పడితే డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
* కనెక్టివిటీ ఆప్షన్లు
ఇప్పుడున్న రోజుల్లో టీవీకి ఎక్కువ పోర్టులు ఉండటం చాలా అవసరం. కనీసం 2-3 HDMI, USB పోర్టులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గేమింగ్ కన్సోల్లు, స్ట్రీమింగ్ స్టిక్‌లు లేదా పెన్ డ్రైవ్‌లు లాంటివి కనెక్ట్ చేసుకోవాలంటే ఈ పోర్టులు చాలా అవసరం. లేదంటే ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
* ర్యామ్, స్టోరేజ్
స్మార్ట్ టీవీ ఎంత బాగా పనిచేస్తుందనేది దాని ర్యామ్, స్టోరేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కనీసం 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. ఇది టీవీలోని యాప్స్‌ను స్మూత్‌గా రన్ చేయడానికి, ఎక్కువ యాప్స్‌ను, మీడియా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే టీవీ స్లోగా పనిచేసి చిరాకు తెప్పిస్తుంది.
* వారంటీ, అప్డేట్స్
టీవీకి ఎంత ఎక్కువ వారంటీ ఉంటే అంత మంచిది. ఇది మీ మనసుకు కొంచెం ప్రశాంతతనిస్తుంది. అలాగే, టీవీ బ్రాండ్ రెగ్యులర్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. అప్డేట్స్ వస్తేనే కొత్త ఫీచర్లు వస్తాయి, సెక్యూరిటీ కూడా బాగుంటుంది.
* మరిన్ని టిప్స్
టీవీ కొనే ముందు కచ్చితంగా కస్టమర్ రివ్యూలు చదవాలి. అప్పుడే టీవీ గురించి నిజమైన విషయాలు తెలుస్తాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ధరలను సరిపోల్చి చూడాలి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనొచ్చు.
క్వాలిటీ కోసం మంచి బ్రాండ్‌ను ఎంచుకోవాలి. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉంటే చెక్ చేసుకోవాలి. వీటి ద్వారా మీరు మరిన్ని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే, అవసరాలకు తగ్గట్టు, బెస్ట్ స్మార్ట్ టీవీని కచ్చితంగా కొనుగోలు చేయగలరు.
































