1 గ్లాస్ తాగితే చాలు అధిక బరువు, బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది.. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య చాలా ఎక్కువ అయ్యిపోయింది.
ఈ సమస్య నుండి బయట పడితే ఎన్నో రకాల అనారోగ్యల నుండి విముక్తి లభిస్తుంది. దాంతో బరువు తగ్గటానికి, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయినా పెద్దగా ప్రయోజనం కనపడక చాలా నిరాశ చెంది మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ వైపు చూస్తారు. కానీ వాటిని వాడితే తాత్కాలికంగా మాత్రమే ఫలితం ఉంటుంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే చాలు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, 5 కరివేపాకు ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి ఆ నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,అరస్పూన్ తేనె కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
ఈ డ్రింక్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. 15 రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. జీలకర్ర, ధనియాలు, కరివేపాకులో ఉన్న గుణాలు బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.