సిలిండర్ ఆపేశారా? ఇంటికి తాళం వేసారా? ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారా?

కొంతమంది తుడిచిందే తుడుస్తుంటారు. మరికొందరు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. తలుపుకు తాళం వేసామా? తాళం బ్యాగ్‌లో వేసాక కూడా వేశామా లేదా అని చెక్ చేస్తుంటారు.
మీరు ఇలా చేశారు. నేను అయితే చాలా సార్లు ఇలానే చేస్తుంటారు.


ఏదో ఒక అనుమానుంతో రోజూ సతమతమవుతుంటాం. ఎదుటివాళ్లు చాదస్తం అనో, లేక మతిమరుపు అనో అంటుంచారు. అయితే దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఒక మెంటల్ ఇల్‌నెస్ అంటున్నారు నిపుణులు. ఈ లక్షణాలు కొంతవరకు ఉండే పర్వాలేదు.

కొంతమందిలో ఈ లక్షణాలు పీక్ స్టేజ్‌లో ఉంటున్నాయి. అయితే ఈ మానసిక రుగ్మతనే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) అంటారు. దీని లక్షణాలు, చికిత్స, డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ప్రతి పది మందిలో దాదాపు 2 ఓసీడీతో బాధపడుతున్నారు.

ఈ మానసిక రుగ్మత ఆడ, మగ అనే తేడా లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది. ఎక్కువగా 30 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుం. అయితే కొంతమంది ఓసీడీ అంటే అతి శుభ్రంగా ఉండటమని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. ఓసీడీలో కూడా కొన్ని వేరే లక్షణాలు కనిపిస్తాయి.

ఓసీడీ 30 ఏళ్ల పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చేయని పని కూడా చేసినట్లు, భవనం పై నుంచి దూకి దూకేయాలని అనిపిస్తున్నట్లు ఉంటుంది. చేసిన పనినే మర్చిపోయి మళ్లీ చేసేస్తుంటారు. ఇవన్నీ కూడా ఓసీడీలో భాగమే.

ప్రస్తుతం ఓసీడీకి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీల ద్వారా చాలా మందిలో ఈ లక్షణాలు అదుపులో ఉంటున్నాయి. దీని కోసం చాలా కాలం ట్రీట్మంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆలోచన దృక్పథాన్ని మార్చొచ్చు.

(Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.