గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు.ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది.
తాజాగా మరోసారి నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్‌ను దూరం చేసే కార్యక్రమం ఒకటి జరిగింది. ఇటీవలే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ,రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు.దీనిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు సైతం రియాక్ట్ అయ్యారు.ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.
దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అభిమానులు భావించారు.కానీ నందమూరి కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి స్పెషల్ పేపర్ యాడ్ ఇచ్చారు. ఈ యాడ్‌లో ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన అందరి పేర్లు కనిపించాయి.కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం కనిపించలేదు. దీంతో వీరి మధ్య గొడవలు ఉన్నాయని మరోసారి బయటపడ్డాయి. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో టు సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు చెందిన ఫాంహోస్‌లో ఈ పార్టీ జరగనుందని తెలుస్తోంది.
ఈ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి, నారా కుటుంబ సన్నిహితులు, బంధువులందరూ హాజరు కానున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శక, నిర్మాతలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.అయితే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు మాత్రం ఈ పార్టీకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇంకెన్నాళ్లు ఎన్టీఆర్‌ను దూరం పెడతారంటూ బాలకృష్ణను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
































