14 Days No Sugar: వరుసగా 14 రోజుల పాటు అసలు పంచదార వాడకాన్ని బంద్ చేస్తే.. ఈ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలివీ..

www.mannamweb.com


14 Days No Sugar: వరుసగా 14 రోజుల పాటు అసలు పంచదార వాడకాన్ని బంద్ చేస్తే.. ఈ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలివీ..

ఉదయాన్నే వేడి వేడి టీ, లేదా కాఫీతో రోజును మొదలుపెడతాం. చిక్కని టీలో సరిపడా పాలు, డికాషన్, చక్కెర సమపాళ్ళలో ఉంటే నోటికి రుచేకాదు. మనసుకు హాయికూడా..
ఇందులో ఏది తగ్గినా చక్కని టీ తాగిన ఫీలింగ్ పోతుంది. ముఖ్యంగా టీలో చక్కెర తగ్గితే మాత్రం నోటికి రుచిగా అనిపించదు. తియ్యటి ఏ తీపి పదార్థం తిన్నా బెల్లంకన్నా చక్కెర ఉండాల్సిందే. కూరలలో ఉప్పు ఎంత ముఖ్యమో.. తీపి పదార్థాలు అనగానే పంచదార ఉండి తీరాల్సిందే. బెల్లం కన్నా పంచదారతో చేసే స్వీట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే మితిమీరిన చక్కెర వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి.

చక్కెర మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. దీనిని టీ నుండి స్వీట్ల వరకు ఉపయోగిస్తున్నాం. అది లేకుండా రుచి చప్పగా అనిపిస్తుంది. చక్కెర ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నాం. ఈ చక్కెర వాడకం వల్ల మధుమేహం, ఊబకాయం, దంతాల నష్టం వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వినియోగంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎక్కువ చక్కెర తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకుని చక్కెర వాడకం తగ్గించుకుంటే అది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకుందాం.

14 రోజులు చక్కెరను వాడటం తగ్గిస్తే అది శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం.

శరీరంపై చక్కెర ప్రభావం గురించి పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ ఇలా చెప్పారు. 14 రోజుల పాటు, చక్కెరను వాడటం మానేస్తే, దాని ఫలితాలు శరీరంలో చూడవచ్చు. చక్కెర లేనప్పుడు, మన శరీరం రక్తంలో చక్కెర స్థాయిని మరింత ప్రభావవంతంగా నియంత్రించడం ప్రారంభిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది.