మాకొద్దు ఈ అధ్యక్షడు.. 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయం ట్రంప్ ప్రభుత్వ వ్యూహం నెమ్మదిగా ఫలిస్తోంది. గురువారం ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది.


ఈ నేపథ్యంలో ఇప్పటికే 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో తెలిపింది. ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది. ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నదే. ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని వెల్లడించింది.

బై అవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8నెలల జీతం ఇస్తారని అందులో వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఓ నిర్ణయానికి రావాలని ఇందులో తెలిపారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నా.. దానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.