బిగ్ అలర్ట్.. ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

సాధారణంగా బ్యాంకు(Bank)ల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్(Savings Account), శాలరీ అకౌంట్‌(Salary Account)కు సంబంధించి డిపాజిట్లు, విత్‌డ్రా సహా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Diposits) చేసేందుకు బ్యాంకులకు వెళ్తుంటారు.


అంతేకాదు ఏదైనా పొదుపు పథకం(Saving Scheme)లో పెట్టుబడులు పెట్టేందుకు, చెక్ బుక్స్(Check Books), పాస్ బుక్(Passbook) వంటి సేవలు పొందేందుకు, లోన్స్ తీసుకోవాలంటే బ్యాంకు కి వెళ్లాల్సిందే. ఇదిలా ఉంటే.. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ బ్యాంకులు సమ్మె బాట పట్టే అవకాశం ఉంది.

వచ్చే నెలలో(మార్చి) 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండటంతో బ్యాంక్ సేవల(Bank Services)కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. దీంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 5 రోజుల పని దినాలు(Work Days), కొత్త జాబ్స్(News Jobs) , DFS రివ్యూ ను తొలగించడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల జీతం వరకు ఐటీ మినహాయింపు డిమాండ్లను నేరావేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.