అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గీత ఆర్ట్ బ్యానర్స్ స్థాపించి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఇలా నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హీరోగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు ఇక నటన విషయంలోనూ డాన్స్ విషయంలోనూ అల్లు అర్జున్ కంటూ ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. డాన్స్ విషయంలో బన్నీని బీట్ చేసేవారు లేరని చెప్పాలి చిరంజీవి తర్వాత అంతటి గ్రేస్ కలిగినటువంటి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.
ఇకపోతే అల్లు అర్జున్ ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అంటే కచ్చితంగా తన మామయ్య చిరంజీవి కారణంగానే అల్లు అర్జున్ డాన్స్ విషయంలో ఇలా సక్సెస్ అయ్యారని చిరంజీవి నుంచి తనకు ఈ డాన్స్ వచ్చిందని అభిమానులు భావించేవారు కానీ అల్లు అరవింద్ మాత్రం ఇటీవల తండేల్ సినిమా ప్రమోషన్లలో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
నాకు డాన్స్ ఏమాత్రం రాదు కానీ అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారు. తనకు ఇలా డాన్స్ నేర్చుకోవడం నా భార్య నిర్మల నుంచి వచ్చిందని నిర్మల చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా మరోసారి మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. బన్నీ తన డాన్స్ ను వారి మామయ్య నుంచి పునికి పుచ్చుకున్నారని చెబితే బాగుండేది కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
































