మహీంద్రా & మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV మోడల్స్ XEV 9e, BE 6 లకు ధరలు, డెలివరీ కాలక్రమాన్ని ప్రకటించింది. బుకింగ్‌లు ఫిబ్రవరి 14, 2025 నుండి ప్రారంభమవుతాయి. BE 6 రూ. 18.90 లక్షల నుండి, XEV 9e రూ. 21.90 లక్షల నుండి ప్రారంభమవుతాయి.
మహీంద్రా & మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV మోడల్స్ XEV 9e మరియు BE 6 లకు ధరలు మరియు డెలివరీ కాలక్రమాన్ని ప్రకటించింది. ఈ రెండు మోడళ్లకు బుకింగ్‌లు ఫిబ్రవరి 14, 2025 (ఉదయం 9 గంటలకు) ప్రారంభమవుతాయి. వాటి ధరలు మరియు డెలివరీ సమయాల వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
మహీంద్రా BE 6 ధర: మహీంద్రా BE 6 మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరలు రూ. 18.90 లక్షల నుండి రూ. 26.90 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). వేరియంట్ వారీగా ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Pack One (59 kWh): రూ.18.90 లక్షలు
Pack One Above (59 kWh): రూ.20.50 లక్షలు
Pack Two (59 kWh): రూ.21.90 లక్షలు
Pack Three Select (59 kWh): రూ.24.50 లక్షలు
Pack Three (79 kWh): రూ.26.90 లక్షలు
మహీంద్రా XEV 9e ధర:
మహీంద్రా XEV 9e 4 వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది.
దీని ధరలు రూ.21.90 లక్షల to రూ.30.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
XEV 9e వేరియెంట్-వైజ్ ధరలు:
Pack One (59 kWh): రూ.21.90 లక్షలు
Pack One Above (59 kWh): NA
Pack Two (59 kWh): రూ.24.90 లక్షలు
Pack Three Select (59 kWh): రూ.27.90 లక్షలు
Pack Three (79 kWh): రూ.30.50 లక్షలు
డెలివరీ:
Pack One/One Above: ఆగస్ట్ 2025
Pack Two: జూలై 2025
Pack Three Select: జూన్ 2025
Pack Three: మార్చి 2025
మహీంద్రా BE 6, XEV 9e కొత్త INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ వాహనాలు రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తాయి. దీనితో పాటు, AC వాల్ బాక్స్ ఛార్జర్‌లకు అదనపు ధరలు ఉన్నాయి. 7.2 kW AC ఛార్జర్ ధర రూ.50,000 మరియు 11.2 kW AC ఛార్జర్ ధర రూ.75,000. మహీంద్రా BE 6, XEV 9e కార్లు ఇండియన్ NCAP భద్రతా రేటింగ్‌లో 5 నక్షత్రాలను సాధించాయి. అంతేకాకుండా, ఈ కారును ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి అపరిమిత వారంటీ లభిస్తుంది.
































