ఈ నెల 10న ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలి
• అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలి
ఈ నెల 10 వ తేదీన జరిగే ‘పరీక్షా పే చర్చ 2025’లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విద్యార్థులతో చేపట్టిన సంభాషణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ వీక్షించాలని, ఈ దిశగా పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
10 ఫిబ్రవరి 2025న (సోమవారం) ఉదయం 11.00 గంటలకు దూరదర్శన్ ద్వారా DD నేషనల్, DD న్యూస్ మరియు DD ఇండియా, రేడియో ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు. 8వ ఎడిషన్ పరీక్ష పే చర్చ 2025 కోసం విద్యార్థులతో జరిపే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 9వ తరగతి నుండి పాఠశాల విద్యార్థులతో సంభాషణ ఉంటుందని తెలిపారు. https://www.youtube.com/watch?v=G5UhdwmEEls లింక్ ద్వారా ఆన్లైన్లో చూడవచ్చన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షిస్తున్న ఫొటోలను అదే రోజు MyGov పోర్టల్ (https://innovateindia1.mygov.in/)లో అప్లోడ్ చేయాలన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షిస్తున్న ఫొటోలను
కార్యక్రమం పూర్తయిన వెంటనే సంబంధిత ఉన్నత పాఠశాల ప్రధానోపధ్యాయులు https://forms.gle/wbWVFkyGogvdP6pr8 లింక్లో ఛాయాచిత్రాలను SCERT, APకి అప్లోడ్ చేయాలని కోరారు.
































