Chiranjeevi vs YS Jagan: వైఎస్ జగన్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి.. వీలైనంతవరకూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఏ మాట అంటే, ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తారో అనే ఆలోచనలతో.. కాంట్రవర్షియల్ కామెంట్స్ చెయ్యకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
అంతేకాదు ఆయన విమర్శల్ని తట్టుకోలేరు. అందుకే ప్రజారాజ్యం పార్టీ పెట్టాక.. ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శల్ని తట్టుకోలేక.. చివరకు రాజకీయాలకు దూరం అయ్యారు. 2008లో పార్టీ పెట్టిన 8 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చేశారు. అలాంటి ఆయన తాజాగా ఓ సెన్సేషనల్ కామెంట్ చేశారు. అది దుమారం రేపేలా ఉంది.


ప్రజారాజ్యమే జనసేన:
ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా మారిందని చిరంజీవి అన్నారు. తాజాగా ఆయన.. విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అన్నారు. అంతేకాదు.. జై జనసేన అంటూ.. ఆ పార్టీ కార్యకర్తలనూ, అభిమానులనూ హుషారెత్తించారు. పవన్ కళ్యాణ్‌కి ఫుల్ సపోర్టుగా మాట్లాడారు.

ఎలా తీసుకోవాలి?
చిరంజీవి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి అనేది తేలాల్సిన అంశం. అసలు లైలా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లిన చిరంజీవి.. జనసేన ప్రస్థావన ఎందుకు తెచ్చారనే డౌట్ మనకు రావచ్చు. దీనికి బలమైన కారణం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో.. ఆ పార్టీకి అనుకూలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. ఇలా వీళ్లు ఎక్కడెక్కడ ప్రచారం చేశారో.. అక్కడక్కడ బీజేపీ గెలిచింది. దాంతో.. కేంద్రంలో వీళ్లకు క్రేజ్ బాగా పెరిగింది. కేంద్రం కూడా ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది. పైగా ఇటీవల చిరంజీవితో ప్రధాని మోదీ తరచూ సంభాషణలు చేస్తున్నారు. ఇలా.. బీజేపీతో పవన్ దోస్తీ కారణంగా.. చిరంజీవికి కూడా.. కేంద్రంలో పలుకుబడి మరింత పెరిగింది. దాంతో.. మెగాస్టార్.. తన తమ్ముణ్ని మెచ్చుకునే క్రమంలో.. జనసేనను హైలెట్ చేశారు.

వైఎస్ జగన్‌కి షాక్:
చిరంజీవి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద షాక్ అనుకోవాలి. ఎందుకంటే.. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చిరంజీవి.. జగన్‌ని కలిసి.. ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పట్లో జనసేన గురించి ఎక్కడా మాట్లాడలేదు. కారణం విమర్శలు వస్తాయేమో అనే. తీరా ఎన్నికల సమయంలో మాత్రం కాస్త ధైర్యం చేశారు. జనసేనకి సపోర్ట్ ఇచ్చారు. రూ.5కోట్లు విరాళం ఇచ్చారు. ఐతే, అప్పుడు కూడా మరీ ఎక్కువగా ఏదీ మాట్లాడలేదు. నొప్పించక, తానొవ్వక అన్నట్లుగా ఆచితూచి స్పందించారు. ఇప్పుడు ఆయన ఫ్రీ అయిపోయారు. ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగంగా ఉంది. అటు వైసీపీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే చిరంజీవి ఓపెన్ అయిపోయారు. ఇన్నాళ్లూ ఉన్న అభిమానాన్ని ఇప్పుడు బయటపెట్టేశారు.
నిజమేనా:
ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపొంతరం చెందింది అని చిరంజీవి చెప్పింది.. టెక్నికల్‌గా నిజం కాదు. ఎందుకంటే.. స్వయంగా మెగాస్టారే.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్ర మంత్రి అయ్యారు. మరి ఆయన ఇప్పుడు ఎందుకు అలా అన్నారంటే.. మెగాస్టార్ అభిమానులే, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా. ప్రజారాజ్యం పార్టీని అభిమానించిన వారంతా.. ఇప్పుడు జనసేనతో ఉన్నారు. అంటే.. టెక్నికల్‌గా ప్రజారాజ్యం, జనసేన వేర్వేరు అయినప్పటికీ.. కార్యకర్తలు, అభిమానుల పరంగా.. రెండూ ఒకటే. ఇంకా చెప్పాలంటే.. ప్రజారాజ్యాన్ని జనసేన మించిపోయింది. ఆ పార్టీ రోజురోజుకూ మరింతగా ప్రజాభిమానాన్ని పొందుతోంది. అందువల్ల చిరంజీవి వ్యాఖ్యలు జనసేన క్యాడర్‌కి ఆనందం కలిగించడం ఖాయం, అదే సమయంలో వైసీపీలో మంట పుట్టించడం కూడా ఖాయమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.