Govt Jobs: యువతకు భారీ గుడ్ న్యూస్.. NRDRM ద్వారా 6881 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీక్రియేషన్‌ మిషన్‌ (NRDRM) – మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6881 పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరోవైపు ఏపీలోనూ 6881 ఖాళీలు ఉన్నాయి. ఇక, అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టులకు 23- 43 ఏళ్ల మధ్య, అకౌంట్ ఆఫీసర్‌ పోస్టులకు 22- 43 ఏళ్ల మధ్య, టెక్నికల్ అసిస్టెంట్‌, డేటా మేనేజర్‌, ఎంఐఎస్‌ మేనేజర్‌ పోస్టులకు 21- 43 ఏళ్ల మధ్య, మిగతా పోస్టులకు 18- 43 ఏళ్ల మధ్య ఉండాలి.
డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.36,769, అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.27,450, టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,750, డేటా మేనేజర్‌ పోస్టులకు రూ.28,350, ఎంఐఎస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.25,650, ఎంఐఎస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.24,650, మల్టీ టాస్కింగ్ అఫిషియల్‌ పోస్టులకు రూ.23,450, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు రూ.23,250, ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ పోస్టులకు రూ.23,250, ఫెసిలిటేటర్స్‌కు రూ.22,750 ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6881 ఖాళీలు భర్తీ చేయనుండగా.. ఇందులో డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇక, బ్రీఫ్‌గా నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం..

తెలంగాణలో పోస్టులు – 6881
డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు ఆఫీసర్ (District Project Officer): 93
అకౌంట్‌ ఆఫీసర్‌ (Account Officer): 140
టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant): 198
డేటా మేనేజర్‌ (Data Manager): 383
ఎంఐఎస్‌ మేనేజర్‌ (MIS Manager): 626
ఎంఐఎస్‌ అసిస్టెంట్ (MIS Assistant): 930
మల్టీ టాస్కింగ్ అఫిషియల్ (Multi Tasking Official): 862
కంప్యూటర్‌ ఆపరేటర్‌ (Computer Operator): 1290
ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ (Field Coordinator): 1256
ఫెసిలిటేటర్స్‌ (Felicitators): 1103

ఎంపిక విధానం: రాత పరీక్ష
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.399 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.299.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 5, 2025
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2025