విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యాధరపురం(Vidyadharapuram) ఆర్టీసీ బస్ డిపో(RTC Bus Depo) సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్(Jalakanya Exhibition)లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ప్రమాదంపై సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికిు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, సిబ్బంది భావిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
































