నిరుద్యోగులకు ఏపీ పోస్టల్ డిపార్ట్‌మెంట్ తీపి వార్త చెప్పింది. దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం అందుతుండటం గమనార్హం.
ఈ ఉద్యోగాల విషయానికి వస్తే ఏపీలో 1215, తెలంగాణలో 519 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయని చెప్పవచ్చు. విధులు నిర్వర్తించడానికి అవసరమైన పరికరాలను పోస్టల్ డిపార్ట్‌మెంట్ అందిస్తుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి రూ.10,000 నుండి రూ.12,000 వరకు జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగాల ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3వ తేదీ చివరి తేదీ. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ ఉద్యోగాలకు పోటీ కాస్త ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు.
పదవ తరగతి వరకు తెలుగు సబ్జెక్టు చదివిన వారు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారికి కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సైకిల్ ఉండాలి. అనుభవాన్ని బట్టి జీతం పెరుగుతుందని చెప్పవచ్చు.