Success Story: కోటీశ్వరుడు అయిన డెలివరీ బాయ్.. సక్సెస్ అంటే ఇలా ఉండాలి..

www.mannamweb.com


Ambur Iyyappa: ఒక వ్యక్తి ఉద్యోగిగా సక్సెస్ అవ్వాలంటే ఎంతో కృషి చేయాలి. కంపెనీ కోసం ఎంత పనిచేసినా కంపెనీ గుర్తిస్తుందని నమ్మకం లేని పరిస్థితులు బయట ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అంబూర్ అయ్యప్ప సక్సెస్ స్టోరీ గురించే. దాదాపు 12 ఏళ్ల కిందట ఒక సాధారణ డెలివరీ బాయ్‌గా ఒక కొరియర్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా అయ్యర్ కెరీర్ ప్రారంభమైంది. తాను పనిచేస్తున్న ఫస్ట్‌ఫ్లైట్ కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కానీ ఇప్పుడు ఆయన ఈకామర్స్ దిగ్గజం ఫిప్‌కార్ట్‌లో ఉన్నత స్థాయి అధికారిగా మల్టీ మిలియనీర్ స్థాయికి చేరుకున్నారు.
అయ్యప్ప తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని అంబూరులో జన్మించాడు. డిప్లొమా తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా తన ప్రయాణాన్ని మెుదలుపెట్టారు. ఆ తర్వాత హిందుస్థాన్ మోటార్స్ కంపెనీలో చేరాడు. తర్వాత కొరియర్ కంపెనీలో ఉద్యోగిగా మారాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఫిప్ కార్ట్ సదరు కొరియర్ కంపెనీతో జతకట్టింది. అలా అయ్యప్ప పనిగురించి తెలుసుకుని తొలినాళ్లలో సచిన్, బిన్నీ బన్సల్ తమ స్టార్టప్ కంపెనీలో పనిలోకి తీసుకున్నారు. ఆ సమయంలో కనీసం ఆఫర్ లెటర్ ఇచ్చేందుకు స్టార్టప్ కంపెనీకి హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ సైతం లేకపోవటం గమనార్హం.
తొలినాళ్లలో కంపెనీకి వచ్చిన ఆర్డర్లను తానొక్కడే నిర్వహించేవాడు. దీంతో అతడిని ‘Human ERP’అనే బిరుదు ఇవ్వబడింది. ఒక్కడే రోజూ దాదాపు 1000 ఆర్డర్లకు పైగా ప్రాసెస్ చేయటంతో కంపెనీ అయ్యర్ పనిసామర్థ్యాన్ని గుర్తించి కంపెనీలో తర్వాతి కాలంలో సముచిత స్థానాన్ని అందించింది. అలా తొలినాళ్లలో ఉద్యోగిగా అందుకున్న స్టాక్ ఆప్షన్లను 2009లో అయ్యప్ప విక్రయించారు. ప్రస్తుతం కంపెనీలో మల్టీబిలియనీర్ గా మారారు. ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్ కోసం అసోసియేట్ డైరెక్టర్ హోదాలో అంబుర్ అయ్యప్ప కొనసాగుతున్నారు. చిరు ఉద్యోగి స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఒకే కంపెనీలో పనిచేసి మారిన అయ్యప్ప సక్సెస్ స్టోరీ నేటి తరం యువతకు ఆదర్శనీయం.