ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండెపాటు కారణంగా మరణిస్తున్నారు. గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ప్రతి వంద మందిలో దాదాపు 20 మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు.
చిన్న వయసు వారు కూడా ఈ హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ అసలు కారణాలు మారుతున్న జీవన శైలి, ఒత్తిడి అలాగే పోషకాలు లేని ఆహారపు అలవాట్లు. అంతేకాకుండా స్నానం చేసే పద్దతి సరిగ్గా లేకున్నా గుండె పోటు ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేసేటప్పుడు పక్షవాతం గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణం సరైన పద్ధతిలో స్నానం చేయకపోవడం.
ముఖ్యంగా గుండె జబ్బులు అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు స్నానంని సరైన పద్ధతిలో చేయాలి. సాధారణంగా చల్లని నీళ్లతో స్నానం చేసినప్పుడు మాత్రమే గుండెపోటు సమస్య వస్తూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు నేరుగా తలపై నీటిని పోయడం వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. స్నానం చేయడానికి సరైన మార్గం ఏమిటంటే మొదట కాళ్లపై, ఆ తర్వాత నడుము, మెడ, చివరగా తలపై నీళ్లను పోయాలి. చల్లని నీళ్లను నేరుగా తలపై పోయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ముఖ్యంగా నీరు మరీ చల్లగా ఉంటే.. అది కేశనాళిక సిరలు కుంచించుకుపోయేలా చేస్తుంది.
అలాగే రక్తపోటు కూడా ఉన్నట్టుండి బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ తల నుండి కాలి వరకు జరుగుతుంది. తలపై చల్లని నీరు పడిన వెంటనే రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది స్ట్రోక్ మరియు హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే రక్తం గుండెకు సరిగ్గా చేరదు. కాబట్టి స్నానం చేయడానికి మగ్గును ఉపయోగించి.ముందుగా మీ పాదాలపై నీటిని పోయగా అది నీటి ఉష్ణోగ్రత గురించి శరీరానికి తెలిసేలా చేస్తుంది. నెమ్మదిగా పాదాల తరువాత నీటిని పైకి పోయాలి. చివరగా, మీ తలపై నీటిని పోయండి. ఇది మెదడుకు షాక్ ఇవ్వదు. రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది.