కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని కెనరా బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది.
బ్యాంకులో పనిచేస్తున్న ఒక అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు ఆభరణాలను దొంగిలించాడని అధికారులు కనుగొన్నారు.
బంగారం మాయమైన తర్వాత, ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సిబ్బంది హామీ ఇచ్చారు.