ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.


రమేష్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు.

ఆ ఉపాధ్యాయుడు సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందినవాడు. 2024లో నాలుగు నెలల క్రితం డీఎస్సీ ద్వారా గాంధారి పాఠశాలలో మొదటి పోస్టింగ్ పొందాడు.

ఉద్యోగంలో చేరినప్పటి నుండి అతని ప్రవర్తన కొద్దిగా భిన్నంగా ఉందని పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారని ఎస్ఐ వివరించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.