జీబీఎస్‌తో గుంటూరు లో మరో మహిళ మృతి

గుంటూరు: గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు.


జీబీఎస్‌ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌ బుధవారం మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఇదే వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో కలకలం రేగుతోంది. జీబీఎస్‌తో మరి కొందరు బాధితులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.