AP News : ఇక నుంచి రాష్ట్రంలో కాగిత రహిత పరిపాలన.

పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలనకు ఏపీ ప్రభుత్వం(AP Government) శ్రీకారం చుట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో దుర్వినియోగం, అక్రమాల నిరోధంపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్ ఇకపై పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌‌(Paperless Administration)ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విజయవాడ(Vijayawada)లోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌(Civil Supplies Bhawan)లో ఆ శాఖ ఉన్నతాధికారులు, రైస్‌ మిల్లర్లు, గొడౌన్ల నిర్వాహకులు, ఎల్పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ ప్రతినిధులతో విడివిడిగా మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్లలో నిల్వ ఉంచే సరుకుల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సివిల్ సప్లైలో కచ్చితంగా ప్రక్షాళన జరగాలని చెప్పారు.. వచ్చే ఖరాఫ్‌కు దేశంలో నెం.1గా ఉండేలా సివిల్‌ సప్లైస్ డీఎస్‌వోలు, డీఎంలు సిద్ధంకావాలన్నారు. అధికారులంతా టీమ్‌ స్పిరిట్‌తో పనిచేయాలని సూచించారు. రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించిందని తెలిపారు. దీపం-2 పథకాన్ని(Deepam-2 Scheme) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.