ప్రస్తుతం జుట్టు రాలే సమస్య చాలా మందిలో పెరిగింది. జుట్టు రాలడంతో పాటు తిరిగి పెరగకపోవడాన్ని అలోపేసియా అంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం అలోపేసియా అరేటా అనేది దీర్ఘకాలిక సమస్య.
ఇది జుట్టు కుదుళ్లు , గోళ్లను ప్రభావితం చేస్తుంది. దీంతో తలపై బట్ట తల రావడం ప్రారంభమవుతుంది. మీరు కూడా జుట్టు రాలడం, బట్టతల వల్ల ఇబ్బంది పడుతుంటే అస్సలు భయపడకండి. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు చాలా ప్రభావ వంతమైన 2 ఆయిల్స్ తో పాటు వాటిని ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆముదం:
ఆముదం జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఇవి కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుని పోయి రంధ్రాల లోపలికి చేరుకోవడం ద్వారా జుట్టుకు తగినంత పోషణ అందుతుంది.
2. రోజ్మేరీ ఆయిల్:
రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో దీనిని చాలా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలపై రక్త ప్రసరణను పెంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
































