గూగుల్ పే, పోన్ పే గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరు. బ్యాంకులకు వెళ్లకుండానే మీ ఆర్ధిక అవసరాలు తీరిపోతాయి. అంతేకాదు మొబైల్ రీఛార్జీ, విద్యుత్, వాటర్ వంటివి కూడా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు.
ప్రతి నెల చెల్లించే బిల్లులు చెల్లించేందుకు ఆటో పే మోడ్ ను ఉపయోగిస్తారు. అయితే ఇది మీకు ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది.
యూపీఐ ఫీచర్లలో ఆటో పే మోడ్ ద్వారా మీరు ఎంచుకున్న తేదీన మీరు కోరుకున్న బిల్లులను చెల్లించనుంది. ఆటో పే మోడ్ సెలెక్ట్ చేసుకున్న సమయంలోనే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతోంది. ఆటో పే మోడ్ ఆన్ చేస్తే మీకు అవసరం ఉన్నా లేకున్నా మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
ఆటో పే మోడ్ ఆప్షన్ ను గుర్తిస్తే వెంటనే దాన్ని డిసేబుల్ చేసుకోండి. ఆటో పే మోడ్ కు బదులుగా ఎప్పటికప్పుడు మీ బిల్లులను ఈ యాప్ ల ద్వారా చెల్లించడం ఉత్తమం.
































