ప్రభుత్వ వైద్యుల(Govt Doctors)కు సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. విధులకు హాజరుకాని వైద్యులను తొలగిస్తూ(Dismiss) ఏపీ ప్రభుత్వం(AP Govt) సంచలన నిర్ణయం తీసుకుంది.
దాదాపు 55 మంది వైద్యులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీరంతా ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నట్లు భారీగా లోకాయుక్త(Lokayukta)కు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన లోకాయుక్త వైద్యుల గైర్హాజరు నిజమేనని తేల్చింది. ఈ మేరకు ప్రజలకు అండాల్సిన వైద్య సేవలపై నిర్లక్ష్యం వహించినందుకు వీరందరినీ విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాల మేరకు 55 మంది వైద్యులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
































