గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆందోళనకరంగా ఉంది. ఏపీ, తెలంగాణలో చికెన్ అమ్మకాలు తగ్గాయి. చికెన్ తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు.
ఈ నేపథ్యంలో గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్‌లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చికెన్ ఫుడ్ ఫెయిర్‌లో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చూపించడానికి ఈ ఫుడ్ ఫెయిర్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు ఉచిత చికెన్ వంటకాల పంపిణీ విషయానికి వస్తే, పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఫుడ్ ఫెయిర్ ప్రాంగణం నిండిపోవడంతో, నిర్వాహకులు గేట్లు మూసివేయాల్సి వచ్చింది.

































