Telengana Inter Hall Tickets :
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
కళాశాల లాగిన్లలో హాల్ టికెట్లను అప్లోడ్ చేసినట్లు ఆయన తెలిపారు. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్‌ను త్వరలో విద్యార్థుల మొబైల్ నంబర్లకు పంపుతామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, మార్చి 5 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మరియు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
































