దంతాలు పసుపు పచ్చగా మారాయా..? కారణం తెలుసా..?

ఆపిల్ సిడర్ వెనిగర్ లో సహజమైన యాసిడ్‌లు ఉండటంతో ఇది దంతాలపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ కలిపి దాంతో పుక్కిలించాలి.


వారానికి 2-3 సార్లు మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. తరచుగా చేస్తే దంతాల పైపొర దెబ్బతినే అవకాశం ఉంది.

కొబ్బరి నూనె దంతాలను శుభ్రపరచడంలోనే కాకుండా బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనె నోటిలో పెట్టుకుని 10-15 నిమిషాల పాటు తిప్పాలి. తర్వాత ఉమ్మివేసి, గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

స్ట్రాబెర్రీలోని మాలిక్ యాసిడ్ దంతాలపై ఉన్న పసుపు మరకలను తగ్గించడంలో సహాయపడుతుంది. రెండు స్ట్రాబెర్రీలను మెత్తగా మెదిపి అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి 2-3 నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి.

తేనెలో సహజమైన యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. కొద్దిగా తేనెలో చిటికెడు కర్పూరం కలిపి దంతాలకు అప్లై చేయాలి. రెండు నిమిషాల తర్వాత వాష్ చేయండి.

బేకింగ్ సోడా సహజమైన శుభ్రపరిచే గుణాల్ని కలిగి ఉంటుంది. ఇది దంతాలపై ఏర్పడిన మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయాలి. బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి 1-2 నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ పద్ధతిని వారానికి రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగిస్తే దంతాల పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యకరమైన దంతాలను కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన అలవాట్లు పాటించడం అవసరం. ప్రతిరోజూ ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. మంచి ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించడం ద్వారా దంతాల గట్టిపాటుతనాన్ని మెరుగుపర్చుకోవచ్చు. బ్రష్ చేసిన తర్వాత మౌత్‌వాష్ ఉపయోగించడం నోటి శుభ్రతను కాపాడడానికి సహాయపడుతుంది. రోజూ టీ, కాఫీ లాంటి డ్రింక్ లు తాగిన వెంటనే గోరువెచ్చని నీటితో పుక్కిలించడం మరకలు ఏర్పడకుండా ఉండటానికి మంచిది. ఇలా చేయడం వల్ల దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.